Sep 28,2023 18:57

భోజనం ప్యాకెట్లు అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు :ఆకలికి అందరూ బంధువులే అనే నినాదంతో ఐ.ఎఫ్‌.సి ఫౌండేషన్‌ కందుకూరు వారి ఆధ్వర్యంలో గురువారం దాతల సహాయంతో పేదవారికోసం కందుకూరులో నిస్సహాయులైన వారిని గుర్తించి వారికి భోజనాల ప్యాకెట్లు అందించారు. ప్రతి ఒక్కరు తమ సామాజిక బాధ్యతగా పేదవారికి సహాయం అందిస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అని ఫౌండేషన్‌ సెక్రెటరీ షంషేర్‌ అన్నారు. ప్రెసిడెంట్‌ సాజిద్‌,ట్రజరర్‌ హఫీజ్‌,ఇంచార్జ్‌ అయూబ్‌ ఖాన్‌ పఠాన్‌, షంషఉద్దీన్‌ ఉన్నారు.