Aug 19,2023 20:35

భోజన ప్యాకెట్లు అందజేస్తున్న ప్రతినిధులు

ప్రజాశక్తి-కందుకూరు :ఆకలికి అందరూ బంధువులే'' అనే నినాదంతో ఐ.ఎఫ్‌.సి ఫౌండేషన్‌ కందుకూరు వారి ఆధ్వర్యంలో శనివారం పేదల కోసం కందుకూరులో వృద్ధులు, వికలాం గులను గుర్తించి వారికి భోజనాల ప్యాకెట్లు అందించారు. ప్రతి ఒక్కరు తమ సామా జిక బాధ్యతగా పేదలకు సాయం అందిస్తే సమాజానికి ఎంతో మేలు జరుగు తుందని ఫౌండేషన్‌ సెక్రెటరీ షంషేర్‌ తెలిపారు. ప్రెసిడెంట్‌ సాజిద్‌,ట్రజరర్‌ హఫీజ్‌,ఇంచార్జ్‌ అయూబ్‌ ఖాన్‌ పఠాన్‌ పాల్గొన్నారు.