Apr 07,2023 17:45

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఐఎంఏ నడక ర్యాలీని ప్రారంభిస్తున్న రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు

ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
ప్రజాశక్తి - నంద్యాల

      ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా శుక్రవారం ఐఎంఏ ఆధ్వర్యంలో నంద్యాలలో ప్రజా అవగాహన నడక ర్యాలీ నిర్వహించారు. స్థానిక మధుమణి నర్సింగ్‌ హౌమ్‌ నుండి ప్రారంభమైన వైద్యుల నడక ర్యాలీని రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్‌ రవి కృష్ణ ప్రారంభించారు. నంద్యాల ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ జఫరుల్లా, డాక్టర్‌ చంద్రశేఖర్‌, కోశాధికారి అనిల్‌, వైద్యులు పాల్గొని మాట్లాడారు. ర్యాలీలో రాష్ట్ర ఐఎంఏ సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ విజయభాస్కర్‌ రెడ్డి, ప్రముఖ వైద్యులు సహదేవుడు, మధుసూదనరావు, ఐఎంఏ మహిళా విభాగం నాయకులు డాక్టర్‌ నాగమణి, వైద్యులు నర్మదా, అరుణకుమారి, మాధవి, వసుధ, లక్ష్మీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.