Jul 02,2023 16:30

జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ వైద్యుల దినోత్సవం ప్రారంభిస్తున్న ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ

ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా వైద్యుల దినోత్సవం
ప్రజాశక్తి - నంద్యాల

       ఐఎంఏ నంద్యాల ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్  బి.సి.రాయ్ జన్మదినోత్సవం సందర్భంగా శని వారం సాయంత్రం స్థానిక సూరజ్ గ్రాండ్ హోటల్ సమావేశ మందిరంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ జఫరుల్లా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రవి కృష్ణ , రాష్ట్ర ఐఎంఏ ప్రధాన కార్యదర్శి ఫణి ధర్, ఐ ఎం ఎ రాష్ట్ర ఫైనాన్స్ కార్యదర్శి డాక్టర్ రవీంద్రనాథ్ ముఖ్యఅతిధులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి  ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా డాక్టర్ బి. సి.రాయ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాష్ట్ర శాఖ తరపున ఐఎంఏ వైద్యుల దినోత్సవ పురస్కారాలను డాక్టర్ భక్తవత్సల రెడ్డి ,డాక్టర్ సుమిత్రమ్మ లకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ నంద్యాల శాఖ వైద్యుల దినోత్సవ పురస్కారాలను డాక్టర్ సాయి కృష్ణ, డాక్టర్ హరిత,డాక్టర్ అరుణకుమారి ,డాక్టర్ లక్ష్మీ సౌజన్య, డాక్టర్ చంద్రకళ, మరియు రాష్ట్ర ఐ ఎమ్ ఏ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ దంపతులను, ఐ ఎం ఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఫణి ధర్,రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి డాక్టర్ రవీంద్రనాథ్ లను ఈ సందర్భంగా నంద్యాల వైద్యుల సంఘం అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.ఈ.పి.వి. రాజశేఖర్ రచించి రూపొందించిన డాక్టర్ బి సి రాయ్ గీతాన్ని ఆవిష్కరించారు. గీతాన్ని రూపొందించిన డాక్టర్ రాజశేఖర్ ను సత్కరించారు.డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఐఎంఏ దేశంలో 1928లో ప్రారంభించబడిందని ఇప్పుడు 35 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో 1750 బ్రాంచీలలో  నాలుగు లక్షల మంది సభ్యులతో ప్రపంచంలో అతిపెద్ద వృత్తి స్వచ్ఛంద సంస్థ ఐఎంఏ అని అన్నారు.దేశంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి, వైద్యుల నిరంతర వైద్య విద్యని ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నదని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 బ్రాంచ్ లలో ఇరవై వేల మంది  అటు ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు రంగంలో ఐఎంఏ సభ్యులు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని, వీరి సమస్యల పరిష్కారం కోసం ఐఎంఏ నిరంతరం పని చేస్తుందని అన్నారు. డాక్టర్ ఫణి ధర్,డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ వైద్యులపై ఆసుపత్రులపై దాడులకు పాల్పడడం సరైన విధానం కాదన్నారు. వైద్యుల రక్షణ చట్టాన్ని రాష్ట్రంలో మరింత కఠిన తరం చేయాల్సిన అవసరం ఉందని అదేవిధంగా జాతీయస్థాయిలో కూడా వైద్య రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్యులకు, వైద్యుల కుటుంబ సభ్యులకు నిర్వహించిన వివిధ క్రీడా పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, ఈ సమావేశంలో నంద్యాల ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్, నంద్యాల శాఖ కోశాధికారి డాక్టర్ అనిల్, మహిళా విభాగ నాయకులు డాక్టర్ నర్మదా ,డాక్టర్ వసుధ,డాక్టర్ నాగమణి, డాక్టర్ లక్ష్మీ సౌజన్య, డాక్టర్ హరిత , అధిక సంఖ్యలో వైద్యులు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.