Oct 22,2023 22:56

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి ప్రజల ఐఎఎస్‌్‌. అధికారిగా పిలువబడిన ఎస్‌ఆర్‌.శంకరన్‌ ఐఎఎస్‌ అధికారులకు ఆదర్శనీయమని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ అన్నారు. ఎస్‌ఆర్‌.శంకరన్‌ 89వ జయంతి సందర్భంగా స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన చిత్రపటానికి ఆదివాసీ మహాసభ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూర్యనారాయణ మాట్లాడుతూ 1986లో శంకరన్‌ సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమా నికి సంబంధించిన జిఒలను పుస్తకంగా ముద్రించారని తెలిపారు. వీటిలో ఇప్పటికీ ఉపయోగపడే 22 జిఒలు ఉన్నాయన్నారు. ఎపి సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్య దర్శిగా ఉన్నప్పుడే ఐటిడిఎలను నెలకొల్పారని గుర్తు చేశారు. స్పెషల్‌ కాంపోనెంట్‌ ప్లాన్‌, ట్రైబల్‌ సబ్‌ ప్లాన్లను ప్రవేశపెట్టారని, వెట్టిచాకిరి నిర్మూలన చట్టం, 1976 రూపొందించడంలో కీలకపాత్ర వహించారని తెలిపారు 2023 అక్టోబర్‌ 22న శంకరన్‌ 89వ జయంతి నుంచి జనవరి 3న జైపాల్‌ సింగ్‌ ముండా జయంతి వరకు ఆదివాసీ హక్కుల ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించాలని, పోలవరం ముంపులోని 373 గ్రామాలను 41.15 కాంటూర్‌ పరిగణించాలని ఆదివాసీ మహాసభ ప్రచురించిన కరపత్రాలను ఈ సందర్భంగా ఆవిష్కరిం చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహాసభ సలహాదారు ఎవి.సత్యనారాయణ, జి.చిన్నారావు పాల్గొన్నారు.