తరగతులు బోధిస్తున్న అశ్విన్ మణిదీప్
ప్రజాశక్తి-గుంటూరు : స్థానిక బ్రాడీపేట యుటిఎఫ్ సమావేశ మందిరంలో కెవిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ (సన్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐఎఎస్ ఫౌండేషన్ క్లాసులు రెండో రోజు కొనసాగాయి. అభ్యర్థులకు యుపిఎస్‌సి పరీక్షల్లో ర్యాంకు సాధించి, శిక్షణ పూర్తి చేసుకున్న ఐఆర్‌ఎస్ అధికారి అశ్విన్ మణిదీప్ శిక్షణా తరగతులు బోధించారు. సివిల్స్ పరీక్షకు సిద్ధం కావాల్సిన పద్దతులు, ప్రస్తుత సమకాలీన అంశాలను గురించి వివరించారు. ఈ శిక్షణ మే 16వ తేదీ వరకూ ఉంటుందని సన్ నిర్వాహకులు కె.సాయికుమార్ తెలిపారు. కార్యక్రమంలో సిహెచ్.బాలు, ఎం.అజరు, పీరుసాహెబ్ పాల్గొన్నారు.










