May 08,2023 21:00

ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : రాజమండ్రిలో గత ఆదివారం నిర్వహించిన ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ (ఐఏఎల్‌) రాష్ట్ర 11వ మహాసభల్లో గుంటూరు బార్‌ అసోసియేషన్‌కు చెందిన సీనియర్‌ న్యాయవాది జె.నరసింహారావు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే సిద్దా సత్యనారాయణ, పరుచూరి నంద రాష్ట్ర డిప్యూటీ జనలర్‌ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు గుంటూరు న్యాయవాదులు వారికి అభినందనలు తెలియజేశారు.