Sep 14,2022 22:34

పతాకావిష్కరణ చేస్తున్న ఐద్వా నాయకులు

ప్రజాశక్తి -గాజువాక : నెల్లూరు జిల్లాలో ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్న ఐద్వా రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని స్టీల్‌ డివిజన్‌ ఐద్వా కార్యదర్శి కె.వేణు పిలుపునిచ్చారు. ఐద్వా రాష్ట్ర 15వ మహాసభలు సందర్భంగా ఐద్వా స్టీల్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యాన తోకాడ సమైక్య అపార్ట్‌మెంట్‌లో స్టీల్‌ డివిజన్‌ అధ్యక్షులు కె.వరలక్ష్మి పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి వేణు మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాల కారణంగా నిత్యావసర ధరలు పెరిగాయన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితి ఉందన్నారు. చట్టసభల్లో మహిళా బిల్లు నేటికీ ఆమోదం పొందకపోవడం దురదృష్టకరమన్నారు. రాజ్యాంగం ద్వారా కల్పించాల్సిన హక్కులపై దాడి జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా మహిళలపై హింసను అరికట్టండి కట్టండి అంటూ సమైక్య అపార్ట్మెంట్‌ ముందు ముగ్గులతో ద్వారా నినదించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు బి.పద్మావతి, జి.శాంతి, హేమలత, పద్మ, కుమారి, రాధ, లక్ష్మి పాల్గొన్నారు.