ప్రజాశక్తి -యంత్రాంగం
గాజువాక : నెల్లూరులో జరగనున్న ఐద్వా రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ అక్కిరెడ్డిపాలెంలో సీనియర్ నాయకులు జె.శ్రీలక్ష్మి శుక్రవారం పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి, దాసరి రవణమ్మ మాట్లాడుతూ, మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వై.లక్ష్మి, యు.లక్ష్మి, ఎల్.పద్మ, అనసూయ, కుమారి, వాణి పాల్గొన్నారు.
ములగాడ : 63వ వార్డు పరిధి క్రాంతినగర్‌లో ఐద్వా ఐద్వా సీనియర్ నాయకులు పూడి దొడ్డమ్మ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్కాపురంజోన్ కార్యదర్శి ఆర్.విమల మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాలు ప్రజలపై పెనుభారాలు మోపుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు వై.కల్యాణి, ఎం.జయలక్ష్మి, ఎన్.ఆదిలక్ష్మి, గోవిందమ్మ, ఎస్.రాధ, డి.కళావతి, డి.పార్వతి పాల్గొన్నారు.










