పతాకావిష్కరణలో పాల్గొన్న ఐద్వా సభ్యులు
ప్రజాశక్తి-గాజువాక: నెల్లూరులో ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఐద్వా రాష్ట్ర మహాసభల నేపథ్యంలో గాజువాక జోన్ కమిటీ ఆధ్వర్యాన షీలానగర్‌లో సీనియర్ నాయకులు ఇందిర పతాకావిష్కరణ చేశారు. ఎం.మాధవి అధ్యక్షతన జరిగిన సభలో ఐద్వా జిల్లా కార్యదర్శి వై.సత్యవతి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం -సమానత్వం -స్త్రీవిముక్తి నినాదాలతో ఐద్వా పనిచేస్తోందన్నారు. స్త్రీల పట్ల జరిగే సాంఘిక దురాచారాలను ఎదుర్కొనడంలో ఐద్వా ముందుటుందన్నారు. ఈ కార్యక్రమంలో బేబీ, కరుణ, మానస, మణి, ఉష, మాధురి, సంతోషి తదితరులు పాల్గొన్నారు.
జివిఎంసి 67వ వార్డు పరిధి జోగవానిపాలెంలో ఐద్వా జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా గాజువాక జోన్ నాయకులు కామేశ్వరి, కె.సంతోషం పాల్గొన్నారు. అనంతరం గురజాడ జయంతిని నిర్వహించారు.










