ప్రజాశక్తి -ములగాడ : ఐద్వా నేత టి. గోవిందమ్మ నాలుగో వర్ధంతిని 62వ వార్డు త్రినాధపురంలో గురువారం నిర్వహించారు. గోవిందమ్మ చిత్రపటానికి ఐద్వా రాష్ట్ర నేత ఆర్ విమల, మల్కాపురం జోన్ నాయకులు కె.అన్నపూర్ణ, వరలక్ష్మి, బి రాజేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మల్కాపురం జోన్ కార్యదర్శి పి.పైడిరాజు, ఐద్వా రాష్ట్ర నేత ఆర్.విమల తదితరులు మాట్లాడుతూ గోవిందమ్మ సేవలను కొనియాడారు. ఆమె మరణం పార్టీకి ఐద్వా సంఘానికి తీరనిలోటన్నారు. సిపిఎం జోన్ నేత, గోవిందమ్మ భర్త టి.అప్పారావు మాట్లాడుతూ గోవిందమ్మ ప్రోత్సాహంతోనే తానీ స్థాయికి చేరానన్నారు. సిపిఎం మల్కాపురం జోన్ నేత పిసిని రామారావు అధ్యక్షతన జరిగిన వర్థంతి సభలో సిఐటియు మల్కాపురం జోన్ అధ్యక్ష కార్యదర్శులు కె.పెంటారావు ఆర్ లక్ష్మణమూర్తి, డివైఎఫ్‌ఐ జోన్ కార్యదర్శి ఎస్ వాసు ఐద్వా ఏరియా నాయకులు కె. అన్నపూర్ణ బి .రాజేశ్వరి ,పి.వరలక్ష్మి, శ్యామల, బి.రామలక్ష్మి, అరుణ, రాణి ధనలక్ష్మి పాల్గొన్నారు.










