Jan 06,2023 23:51

ఐద్వా మహాసభను జయప్రదం చేయాలి

ప్రజాశక్తి- అరకులోయ రూరల్‌: ఐద్వా 13వ ఆల్‌ ఇండియా మహాసభను జయప్రదం చేయాలని గిరిజన మహిళా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని పెదలబుడు పంచాయతీ శరభగుడా, బొండం పంచాయతీ కొత్తవలస, రంగినీవలస, రేగాలో జెండాలను ఆవిష్కరణ చేశారు. ఈనెల 6,7,8,9వ తేదీలో ఆల్‌ ఇండియా మహాసభ కేరళ రాష్ట్రంలో తిరువనంతపురంలో జరుగుతాయని ఐద్వా రాష్ట్ర నాయకులు వివి జయ తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలకు అవకాశాలు కల్పిస్తే అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తారని తెలిపారు. పని ప్రదేశాల్లో శ్రామిక మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. 33శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లుని పార్లమెంట్లో ఆమోదం పెట్టాలని డిమాండ్‌ చేశారు. బిజెపి ప్రభుత్వం వెంటనే 33శాతం బిల్లును ఆమోదించి చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సెక్రెటరీ శశికళ, రాధా, లక్ష్మి, సుందరమ్మ, కళా, సుశీల, నాగమ్మ పాల్గొన్నారు.