ప్రజాశక్తి-అనకాపల్లి
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో శనివారం హింస వ్యతిరేకత పరిష్కార మార్గాలు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్.అరుణ మాట్లాడుతూ సమాజంలో స్త్రీలకు సమాన హక్కు కల్పించాలని, మహిళలపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్నెట్ల ద్వారా అశ్లీల చిత్రాలను బ్యాన్ చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని, మద్యం నియంత్రణ చేయాలని కోరారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇటువంటి పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మండల కార్యదర్శి కె.సుభాషిణి, అధ్యాపకులు సుజాత, నాగమణి పాల్గొన్నారు.










