టూషన్ చెబుతున్న టీచర్
ప్రజాశక్తి- కూనవరం
మండలంలోని చినార్కూరు గ్రామంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ట్యూషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకులు కుంజా రాధ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సావిత్రి బాయి పూలేని ఆదర్శంగా తీసుకువాలన్నారు. పిల్లలు మంచి చదువులతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, చిన్నారులు పాల్గొన్నారు.










