Oct 02,2022 23:53

నినాదాలు చేస్తున్న ఐద్వా మహిళా నేతలు

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్‌ పాలసీని నూతన మద్యం షాపులకు అనుమతి ఇస్తూ తీసుకొచ్చిన జిఓ 667 ను ఉపసంహరించుకోవాలని ఐద్వా ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. ముందుగా గిరిజన మ్యూజియంలో ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం విగ్రహాన్ని వినతి పత్రం అందజేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర నాయకురాలు వివి జయ మాట్లాడారు. అదనంగా టూరిస్ట్‌ ప్రదేశాలలో కూడా మద్యం షాపులకు అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారిగా మధ్యపానం నిషేదం చేస్తామని వైసిపి చెప్పి ఇప్పుడు మాట తప్పారని పేర్కొన్నారు. ఎక్కడ చూసినా మధ్యం ఏరులై పారుతోందన్నారు. టూరిస్ట్‌ కేంద్రాలు, దేవాలయాలు, స్కూల్‌, కళాశాలల వద్ద మంద్యం షాపులకు అనుమతి ఇవ్వరాదన్నారు. మద్యాన్ని నిమంత్రంచకుండా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే పేదల బతుకులు మారుతాయా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గిరిజన మహిళ సంఘం నాయకులు కె.రుక్మిణి, మోనిమా, అపలమ్మా, సంధ్య, చంప, భాను పాల్గొన్నారు.