Jan 13,2023 23:53

విజేతలకు బహుమతులు అందజేస్తున్న మాజీ జెడ్‌పిటిసి రంగమ్మ తదితరులు

ప్రజాశక్తి-చింతూరు
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో మండలంలోని కల్లేరు గ్రామంలో శుక్రవారం ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించారు. మహిళలకు ముగ్గులు, కుర్చీ ఆట, లెమన్‌ అండ్‌ స్పూన్‌ ఆట, బస్తా జంప్‌ ఆట్ల వంటి పోటీలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో మహిళల అభివృద్ధిపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా మండల కార్యదర్శి, మాజీ జెడ్పిటిసి ముర్రం రంగమ్మ మాట్లాడుతూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారని సమాజంలో సగభాగం ఉన్న మహిళలు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలు చైతన్యం పెంపొందించుకోవాలన్నారు. బిజెపి ప్రభుత్వ మతోన్మాద విధానాలపై మహిళలు ఐక్యంగా పోరాడాలన్నారు. ఏజెన్సీలో గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు కోసం, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్‌ అమలుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు సోడె రాములమ్మ, మండల కమిటీ సభ్యులు సోడే కమల, సోడే చిన్నమ్మ, గిరిజన సంఘం నాయకులు సీసం సురేష్‌, సోడే రాఘవయ్య, సచివాలయ ఉద్యోగులు షోడే సౌజన్య, మడకం గ్రామస్తులు సోడే రాములమ్మ, కమలమ్మ, చిన్నమ్మ, రెడ్డి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.