Aug 24,2023 22:24

ప్రతిభా విద్యార్థులతో కళాశాల ప్రతినిధులు

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : ఇటీవల ఎస్కే యూనివర్సిటీ మూడవ సంవత్సరం బిఎస్సి ఐదవ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలలో శ్రీ సత్యకృపా మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్రతిభను కనపరచారని కళాశాల కరస్పాండెంట్‌ పెద్దిరెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరము అత్యుత్తమ ఫలితాలను అందిస్తూ, విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వడం పట్ల తాము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలలో ఎస్‌. పర్వీన్‌ భాను 95, ప్రమీదా 91, ఎస్‌. పవిత్ర 89, జి. సింధు తులాని 88, ఎం. అఖిల 88, వెంకట విజయలక్ష్మి 88 శాతం మార్కులు సాధించారన్నారు. ప్రతిభా విద్యార్థులకుకరెస్పాండెంట్‌ పెద్దిరెడ్డి తో పాటు ప్రిన్సిపల్‌, అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు.
వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ
శ్రీ కష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రకటించిన 5వ సెమిస్టర్‌ బీఎస్సీ ఫలితాలలో స్థానిక శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపల్‌ రిజ్వాన్‌బాషా తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కళాశాలలో విద్యార్థులకు స్వీట్లు పంచి ఆయన అభినందించారు. హేమలత 97 శాతం మార్కులతో టౌన్‌ ఫస్ట్‌ సాధించిందని తెలిపారు. అలాగే మొక్షిని 94, మాధవి 91, షబానా 90, దుర్గేశ్‌ 89, నీహ ఫీర్డోజ్‌,చాందిని 87, నవ్యశ్రీ 86, స్వరూప 85, మునీరబి, రిజ్వాన 83, మనోహర్‌, లక్ష్మీనరసింహ 81, మనోజ్‌ కుమార్‌ 80 శాతం మార్కులు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో కరిముల్లా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.