Apr 24,2023 23:24

విద్యార్థులను అభినందిస్తున్న ఎస్‌కె. మౌలాబి

ప్రజాశక్తి-తెనాలి:స్థానిక రావి సాంబయ్య మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎన్సిసి అవార్డులకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయిని ఎస్‌.కె మౌలాబి సోమవారం వెల్లడించారు. అవార్డులకు ఎంపికైన వారిలో పాలపర్తి లక్ష్మీ పద్మావతి బెస్ట్‌ క్యాడెట్‌గా కూడా ఎంపికైనట్లు చెప్పారు. ఎం.యోచన, పి.లక్ష్మీ పద్మావతి, పి ధర్మ తేజ, ఆర్‌.చింటూ నాయక్‌లు అవార్డులకు ఎంపికైన వారిలో ఉన్నారు. వరుసగా మూడో ఏడాది పాఠశాల విద్యార్థులకు బెస్ట్‌ అవార్డు రావడం విశేషంగా చెప్పారు. అవార్డులకు ఎంపికైన విద్యార్థులకు ఒకొక్కరికి రూ.6వేలు చొప్పున పారితోషకం లభిస్తుందని, అలాగే బెస్ట్‌ క్యాడెట్‌కు అదనంగా మరో రూ.3500ల ఉపకార వేతనం లభిస్తుందన్నారు. ఎంపికైన విద్యార్థులు గుంటూరులో గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ ఎస్‌ఎన్‌ చంద్రశేఖర్‌ నుంచి మొమెంటోలను అందుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో 22 ఆంద్రా బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ ఉమాశంకర్‌ పాల్గొన్నారు.