
ప్రజాశక్తి-విజయవాడ అర్బన్
సంక్లిష్టతలతో జన్మించిన నవజాత శిశువులకు అంకుర హాస్పిటల్‌లోని నిపుణులైన వైద్యుల బృందం, అత్యాధునిక మౌలిక సదుపాయాలు నూతనత్వాన్ని ప్రసాదించాయి. స్త్రీ, శిశు ఆరోగ్యంలో ప్రత్యేక సేవలందించే ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ అంకుర ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కవలలతో సహా ఐదుగురు నెలలు నిండకుండానే జన్మించిన శిశువులకు విజయవంతంగా చికిత్స అందించి వారికి పునర్జీవం కల్పించింది. ఈ సందర్భంగా అంకుర హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి.వి.విజరుకుమార్ మాట్లాడుతూ నెలలు నిండకుండానే జన్మించిన శిశువులకు ఎదురయ్యే ప్రత్యేక సవాళ్లను నిర్వహించడానికి అత్యాధునిక సౌకర్యాలను ఉపయోగించడంలో శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన వైద్యుల బందం తమ సొంతమని తెలిపారు. నెలలు నిండకుండానే జన్మించిన నలుగురు శిశువులు, కవలల ప్రాణాలను కాపాడటం తమ ఆసుపత్రి వైద్య బృందం నైపుణ్యానికి, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతకు నిదర్శనం అన్నారు. అంకుర హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కష్ణ ప్రసాద్‌రావు వున్నం మాట్లాడుతూ క్లిష్టమైన కేసులను విజయవంతంగా చేధించడంలో తమ వైద్య బృందం అంకితభావం, నైపుణ్యానికి నిదర్శనం అన్నారు. అన్ని కేంద్రాల్లో లెవెల్- 3 ఎన్‌ఐసియు, పిఐ, సియు వంటి అత్యాధునిక సదుపాయాలతో రోగులకు అగ్రశ్రేణి ఆరోగ్య సంరక్షణ అందించడం పట్ల అంకుర హాస్పిటల్ విశ్వసనీయతను ఈ కేసులు ఉదాహరణ అన్నారు. ఈ సందర్భంగా శిశువుల తల్లిదండ్రులు ఆసుపత్రి వైద్యులు, రోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ ఇందుశ్రీ సత్తి, డాక్టర్ శ్రీముఖి అనుమోలు, డాక్టర్ రాజా అశోక్ కోగంటి తదితరులు పాల్గొన్నారు.