ప్రజాశక్తి-నందిగామ
కృష్ణా జిల్లా నందిగామ బ్లూమ్స్ అకాడమి ఫిట్‌నెస్ డైరెక్టర్, ట్రైయినర్ నూరుద్ధిన్ (నూరు)కు ''ఎక్సర్సైజ్ ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్ అవార్డు'' లభించింది. న్యూఢిల్లీకి చెందిన లికోయిలేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్రోఫెషనల్ ఆఫ్ ఇండియా.. ఎక్సర్సైజ్ ప్రొఫెషనల్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గురువారం నూరుద్దీన్‌కు అందించి ప్రశంసా పత్రం అందజేసి సత్కరించింది. న్యూఢిల్లీలోని ఇంపీరియల్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఐదు నిముషాల్లో 50 ఎక్సర్సైజ్‌లు చేసి ఆలిండియా రికార్డు సాధించారు. నూరుద్ధీన్ గతంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లు అందుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నుంచి ప్రశంసలు అందుకున్నారు. నందిగామ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రతి రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకే స్త్రీ, పురుషులకు విడివిడిగా ఎరోబిక్స్ వ్యాయామాలు నేర్పుతూ ఎంతోమందిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ముందుకు సాగుతున్నారు. నూరుద్ధీన్‌కు ఎక్సర్సైజ్ ప్రొఫెషనల్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం పట్ల ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు అభినందనలు తెలిపారు.










