ప్రజాశక్తి-పిడుగురాళ్ల :పట్టణంలోని అంగన్వాడి కేంద్రంల్లో సమస్యల పరిష్కారం కోసం ఇన్‌ఛార్జి సిడిపిఒ జోష్నాకు సిఐటియు ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం ఇచ్చారు. సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ 2018 నుండి టీఏ బిల్లులు రావడంలేదని, సెంటర్ అద్దెలు, కూరగాయలు బిల్లులు నెలలు తరబడి పెండింగ్లో ఉంటున్నాయని చెప్పారు. ఎప్పుడో ఇచ్చిన పాత వంటపాత్రలతో వంట చేయాల్సి వస్తోందని, వంట పాత్రలు, కుర్చీలు, బల్లలు ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. వైఎస్‌ఆర్ పోషణ మెనూ ఛార్జీలను పెంచాలని, ఎండ తీవ్రతంగా ఉన్న కారణంగా అంగన్వాడి సెంటర్‌ను ఎనిమిది గంటల నుండి 11:30 వరకు జరిపే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ ఎబి సరస్వతి, సుభాషిణి, అరుణ, వాణి, విజయ రాణి, జయ కుమారి, కె.శివకుమారి, సఫియా పాల్గొన్నారు.










