ప్రజాశక్తి-కోట : కోట మండలం గూడలి-1 పంచాయతీ పరిధిలోని దక్షిణ పాలెంలోని బొల్లోలు. చెంచయ్య ఇటీవల మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకుని సచివాలయం సిబ్బంది వైయస్సార్ బీమా కింద తక్షణ సహాయం క్రింద పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయం కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ గూడలి వైస్ ప్రెసిడెంట్ పల్లెమల్లు. విజయసారధి రెడ్డి,వెల్ఫేర్ అసిస్టెంట్ ఎస్.జ్యోతి వాలంటీర్లు పాల్గొనడం జరిగింది.










