
ప్రజాశక్తి - కశింకోట : ఈ నెల 18 న కశింకోట మండలం చింతలపాలెం గ్రామంలో పసరమారమ్మ తల్లి గుడి వద్ద పులిమంతుల గణేష్ అనే వ్యక్తి వాకింగ్ కు వెళ్తుండగా కారు యాక్సిడెంట్ అయి స్వల్ప గాయలతో ఉష ప్రేమ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నా గణేష్ ను రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి. సోమవరం గ్రామ మాజీ సర్పంచ్ గొంతిని శ్రీనివాసరావు పరామర్శించి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి పది వేల రూపాయలు ఆర్ధిక సహాయం బుధవారం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తొందరగా కోలుకొని ఇంటికి రావాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధికార ప్రతినిధి ఉగ్గిని రమణ మూర్తి. అచ్చెర్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నైయినంశెట్టి రమణారావు.తాళ్లపాలెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వుల్లింగల రమేష్. మాజీ సర్పంచ్ కర్రి దుర్గునాయుడు, జెర్రిపోతుల నూకు నాయుడు పాల్గొన్నారు.