
ప్రజాశక్తి - ఉండ్రాజవరం బహుళజాతి కంపెనీ ఐబిఎంతో శశి డిగ్రీ కళాశాల అవగాహాన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం వేలివెన్ను శశి విద్యాసంస్థల ప్రాంగణంలో జరిగిన ఈ కార్య క్రమంలో శశి విద్యాసంస్థల ఛైర్మన్ బూరుగుపల్లి రవి కుమార్, వైస్ ఛైర్మన్ బురుగుపల్లి లక్ష్మీ సుప్రియ, ఐబిఎం రీజినల్ మేనేజర్ అర్‌డి.మధుసూదన్‌రావులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులు, అధ్యా పకులు అప్‌డేట్ అవుతూ ప్రయోజనకరమైన సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఐబిఎంతో తమ కళాశాల అవగాహాన ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని శశి డిగ్రీ కళాశాల, విశ్వవిద్యాలయం సిలబస్‌తోపాటు విద్యార్థులకు ఎన్నో సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తూ, ఇన్ఫోసిస్, విప్రో వంటి బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఏకైక విద్యాసంస్థ అని అన్నారు. వైస్ ఛైర్మన్ లక్ష్మీ సుప్రియ మాట్లాడుతూ ఐబిఎంతో గ్రామీణ విద్యా ర్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిం చేందుకు ఎంఒయు దోహదం చేస్తుం దన్నారు. ఐబిఎం రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ ఐబిఎంలో 20 వేల కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఎంఒయు ద్వారా అధ్యాపకులు, విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులలో రిజిస్ట్రేషన్ చేసుకుని శిక్షణ పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా అతిథులను సన్మానించి, జ్ఞాపికలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గడా సత్య ప్రకాష్, ఐబిఎం పార్టనర్ కోటిపల్లి బాల గంగాధర్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.