Nov 17,2022 22:10

కైకలూరు ఎంఎల్‌ఎ డిఎన్‌ఆర్‌
ప్రజాశక్తి - కైకలూరు రూరల్‌

               కంటి వైద్యంలో విశేషానుభవం కలిగి.. రాష్ట్రంలోనే ఉత్తమ వైద్యునిగా పేరు తెచ్చుకున్న డాక్టర్‌ ఆళ్ల భాస్కరరెడ్డి కైకలూరు పట్టణంలో నూతన ఐ కేర్‌ క్లినిక్‌ను ప్రారంభించడం అభినందనీయమని ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు (డిఎన్‌ఆర్‌) అన్నారు. గురువారం కైకలూరు పట్టణంలో బృందావనం కాంప్లెక్స్‌లో సాయి శ్రీవల్లీ ఐ కేర్‌ సెంటర్‌ను ప్రజాప్రతినిధులతో కలిసి ఎంఎల్‌ఎ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ డిఎన్‌ఆర్‌ మాట్లాడుతూ కైకలూరు పరిసరప్రాంత ప్రజలకు ఒక మంచి కంటి వైద్య నిపుణులు అందుబాటులోకి రావడం, ముఖ్యంగా స్థానిక కంటి వైద్య నిపుణులు డాక్టర్‌ జాన్‌ విక్టర్‌ బాబు రోజువారీ పర్యవేక్షణలో కంటి రోగులకు వైద్యసేవలు అందించడం చాలా సంతోషమని అన్నారు. తక్కువ ఫీజుతో నాణ్యమైన వైద్యం అందించే ఈ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ కంటి వైద్య నిపుణులు డాక్టర్‌ జాన్‌ విక్టర్‌ బాబు ఎంఎల్‌ఎకు, జంపన రామలింగరాజుకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపిలు అడవి కృష్ణ, చందన ఉమామహేశ్వరరావు, జెడ్‌పిటిసి కురెళ్ల బేబీ, జంపన పెద్దిరామరాజు, కూసంపూడి కనకదుర్గ, సర్పంచి నవరత్నకుమారి, గండికోట ఏసుబాబు, దుట్టా మణి, ఉలిసి వసంతకుమారి, జయమంగళ కాసులు, కూనవరపు సతీష్‌, ఘంటసాల సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.