Feb 18,2023 17:37

శ్రమదానం చేసేందుకు వచ్చిన నంద్యాల డిగ్రీ కళాశాల విద్యార్థులు

అహోబిలoలో  ఎన్.ఎస్.ఎస్ విద్యార్థుల శ్రమదానం
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ

      ప్రముఖ పుణ్య క్షేత్రమైన అహోబిలంలో ఈనెల 26 నుండి  జరగనున్న  బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన  45 మంది ఎన్ఎస్.ఎస్ విద్యార్థులు  సమన్వయకర్త డా.గంగన్న ఆధ్వర్యంలో వారం రోజులపాటు (18 నుండి 24  వరకు) శ్రమదాన కార్యక్రమం చేయడానికి శనివారం అహోబిలం చేరుకున్నారు. ఈ సందర్భంగా డా. గంగన్న మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి  అహోబిలం  లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో బ్రహ్మాత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా  శ్రమదానం చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా శ్రమదానం చేయడానికి వచ్చామన్నారు. అహోబిలం మఠం  వారు సూచించిన విధంగా ఎగువ, దిగువ అహోబిలం ఆలయ ప్రాంగణాలలో, కోనేరు ప్రాంగణంలో పరిసరాలు శుభ్రం చేసి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు.  ఇక్కడ సేవ చేయడం విద్యార్థులకు, తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు..