Jun 05,2022 10:18

మనిషి విజ్ఞానంతో
మశూచిని మట్టుపెట్టాడు
వాక్సిన్తో కరోనాను
కట్టడి చేశాడు (నియంత్రించాడు)
మానవాళిని పీడించే
జటిల సమస్యలను అధిగమించి
విశ్వవిజేతగా నిలిచాడు
మనిషి నివేదించే అహంకారమనే
మహమ్మారిని అడ్డుకోవడంలో
విఫలమయ్యాడు
ఎదుటివారి ఎదుగుదలను
అడ్డుకోవడం
ఇతరుల ప్రయత్నాలను కించపరచడం
ఇతరుల లోపాలు వెతకడం
తాము నమ్మిందే నిజమనే
భ్రమలో జీవిస్తూ
కూపస్త మండూకములా
మునిగి తేలుతూ
మోసాలే ధ్యేయంగా
కుట్రలు కుయుక్తులే లక్ష్యంగా
తాము నమ్మిందే నిజమని
''భ్రమే'' కార్యాచరణగా

తాము చేసిందే గొప్ప అని విర్రవీగే
అనాలోచిత లోకంలో విహరిస్తూ అక్రమమార్గాలే రాచబాటగా
గొప్ప కులం అనే అహంభావం
గొప్పవంశంలో పుట్టామనే అహంభావం
ధనికులమనే అహం ప్రదర్శిస్తూ
మానవీయతను మంట కలుపుతు
అహంభావంలో ''హీరోయిజం''
ఈర్ష్యా ద్వేషాలలో ''విలనిజం''
విడనాడాలి
ఆత్మవిశ్వాసం
ఆత్మాభిమానం ఆత్మగౌరవం
ఆప్యాయత అనురాగాలు
సహనం సంయమనం
సంఘీభావం
సామాజిక సామరస్యత సౌభ్రాతృత్వం
సమతా మమత సమన్వయంతో
అహంకారమనే మహమ్మారిని
మట్టుపెట్టాలి
మమత మానవీయతకు పట్టం కట్టాలి
అహంకారం వద్దు
ఆప్యాయతే ముద్దు
 

నేదునూరి కనకయ్య 94402 45771