ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
మండలంలోని పంగిడిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000-2005 సంవత్సరం వరకు విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఆహ్లాదంగా జరిగింది. పంగిడిగూడెం అన్నపూర్ణ ఫంక్షన్‌హాలులో సోమవారం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం సందర్భంగా పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న రోజుల్లో తమ గురువులను సత్కరించారు. తమ గత జ్ఞాపకాలతో సందడి చేశారు. పూర్వ విద్యార్థులంతా ఒక వేదికపై కలిసేందుకు కృషి చేసిన నున్నా పవన్‌కుమార్‌ను సహచర స్నేహితులు, ఉపాధ్యాయులు అభినందించారు.










