Jan 01,2023 22:19

పజాశక్తి - ఏలూరు టౌన్‌
               కొత్త సంవత్సరం ప్రతి ఇంట్లో ఆనందాలను నింపాలని ఏలూరు నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు ఆకాంక్షించారు. నూతన సంవత్సర సందర్భంగా ఆదివారం ఏలూరు నగరంలోని ప్రముఖలు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, కార్పొరేటర్లు, వ్యాపార, ఉద్యోగ, కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున స్థానిక పవర్‌పేటలోని మేయర్‌ క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు దంపతులకు పుష్పగుచ్ఛాలను అందించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన ఆంగ్ల సంవత్సరంలో ఏలూరు నగరంలోని ప్రజలందరూ శాంతి, శ్రేయస్సు, ఉల్లాసం, సంతోషాలతో విలసిల్లాలన్నారు. నూతన లక్ష్యాలను సాధించడానికి నూతన సంవత్సరం ఎంతగానో ప్రేరేపిస్తుందని ఆమె అన్నారు. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సారధ్యంలో నగరాన్ని అభివృద్ధి దిశగా తమ పాలకవర్గం నడిపిస్తుందని చెప్పారు.
యుటిఎఫ్‌ ఏలూరు మండల శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎంఇఒ సబ్బితి నరసింహమూర్తి నూతనసంవత్సరం కేక్‌ కట్‌ చేసి అభినందనలు తెలిపారు. అనంతరం 2023 యుటిఎఫ్‌ డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరించారు. అనంతరం ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీని, డిప్యూటీ మేయర్‌ నూకపేయి సుధిర్‌బాబును, ఎంపిపి పి.శ్రీనివాసరాజును, ఎండిఒ ప్రణవిని, పలు అధికారులను కలసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియ జేస్తూ, డైరీ, క్యాలెండర్‌ అందించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి నంబూరి రాంబాబు, నాయకులు జివి.సూరపరాజు, పి.శ్రీనివాస్‌కుమార్‌, పివి.సుబ్బారావు, కోటేశ్వరరావు, పి.సత్యనారాయణ, బాషా, కె.దేవీప్రసాద్‌, బి.శ్రీనివాస్‌, శ్రీధర్‌ పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : నూతన సంవత్సర వేడుకలను పట్టణ ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకున్నారు. ఆదివారం నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని పట్టణంలో పలువురు ప్రముఖులు ప్రభుత్వ శాఖ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు స్థానిక ఎంఎల్‌ఎ ఎలిజాను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. వైసిపి నేతలకు, ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎంపిపి కొదమ జ్యోతికి మండల ప్రజా ప్రతినిధులు పుష్ప గుచ్చాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎంపిపి కొదమ జ్యోతి మండల ప్రజా ప్రతినిధులకు, ఉద్యోగులకు, ప్రజలకు శుభాకంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు జెట్టి గురునాధరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకలకు కాంగ్రెస్‌ నాయకులు అధిక సంఖ్యలో చేరుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
టి.నరసాపురం : మండలంలో నూతన సంవత్సర వేడుకలు పలు ప్రార్థనా మందిరాల్లో, గ్రామాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టి.నరసాపురం, పుట్రేపు, ప్రకాష్‌నగర్‌, బొర్రంపాలెం, గండిగూడెం, మక్కినవారిగూడెం, కేతవరం తదితర గ్రామాల్లోని ప్రార్థన మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్‌లు కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. మర్రిగూడెంలో సుమారు వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆయా కార్యక్రమాల్లో యునైటెడ్‌ పాస్టర్స్‌ అసోషియేషన్‌ గౌరవ అధ్యక్షులు కురసం నిరీక్షణరావు, అధ్యక్షులు జి.జ్ఞానరాజు, సిహెచ్‌.హౌషేయ, సిహెచ్‌.రమేష్‌, టి.ప్రసన్నకుమార్‌, డానియల్‌ రాజ్‌, ప్రసన్నరాజు, రాజు, కృపాదానం, ఉన్నారు.
ఆగిరిపల్లి : ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను మండల కేంద్రమైన ఆగిరిపల్లితో సహా పలు గ్రామాల ప్రజలు ఆదివారం ఆనందోత్సాహలతో ఘనంగా జరుపుకున్నారు. ఆగిరిపల్లి తహాశీల్దార్‌ ఎం.ఉదయభాస్కరరావు ఆధ్వర్యంలో ఆగిరిపల్లి రెవెన్యూ కార్యాలయం వద్ద కేక్‌ను కట్‌ చేసి సిబ్బందికి పంచి పెట్టారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు, జిల్లా రెవెన్యూ అధికారి ఎఎస్‌ఎన్‌.మూర్తి, ఎంఎల్‌ఎ ప్రతాప్‌ అప్పారావును మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఒఎల్‌ఆర్‌ ఆర్‌ఐ.కె.లక్ష్మీనాంచారమ్మ, ఎంఆర్‌ఐ ఎంవి.రమణ, ఎఆర్‌ఐ పి.శ్రీనివాసరావు, సినీయర్‌ విఆర్‌ఒ టి.రవిశేఖర్‌, పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ముసునూరు : 2023లో అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారుగ్యాలతో ఉండాలని మండల వైస్‌ ఎంపిపి కోటగిరి రాజానాయన అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో జెడ్‌పిటిసి సభ్యులు వరికూటి ప్రతాప్‌, ఎంపిపి రాపర్ల కృష్ణకుమారి, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, ఎంపిడిఒ జి.రాణి, ఇఒపిఆర్‌డి బసవరాజు అచ్యుత సత్యనారాయణ, తహాశీల్దార్‌ దాసరి సుధ, ఆధ్వరంలో కేకు కట్‌ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ముదినేపల్లి : నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం ముదినేపల్లి మండల ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణను పలువురు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గంటా సంధ్య, వైస్‌ ఎంపిపి రాచూరి రాధా, వైసిపి నాయకులు గంటా కోటేశ్వరరావు, కె.విష్ణువర్థన్‌, బోయిన రామరాజు, షక్‌ అల్లాభక్షు, దివి సతీష్‌, రాచూరి కుమార్‌, బొర్రా శేషుబాబు, శీలం రామకృష్ణ, పైడిపాటి వెంకటరమణ, సాయి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంపిపికి పుష్ప గుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
యుటిఎఫ్‌, పిఆర్‌టియు నూతన సంవత్సర క్యాలెండర్స్‌ను ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ తన కార్యాలయ ంలో ఆదివారం అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా ఉపాధ్యాయ సంఘూల నాయకులు పాల్గొన్నారు.
మండల వ్యాప్తంగా నూతన సంవత్సర వేడు కలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. విశ్వాసులు, యువకులు, చిన్నలు పెద్దలతో చర్చిలు కిటకిటలాడాయి. మండలంలోని కొరగుంటపాలెం చర్చిలో పాస్టర్‌ ఉచ్చుల విజయకుమార్‌ ఆధ్వర్వంలో గ్రామ పిఎసిఎస్‌ చైర్‌పర్సన్‌ అచ్యుత రాంబాబు చేతులు మీదుగా వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు.