May 21,2023 00:40

ప్రతిజ్ఞ చేస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి -ఎస్‌.రాయవరం: మండలంలో సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శనివారం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎలమంచిలి సోషల్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ వి.లావణ్య, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పైడి రాజు, ఆరోగ్య విస్తరణ అధికారులు తంటపురెడ్డి నాగేశ్వరరావు, బిసత్యనారాయణ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. మెడికల్‌ ఆఫీసర్‌ ్‌ ఎస్‌ఎస్‌వి శక్తి ప్రియ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చునన్నారు.ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ వి పైడిరాజు మాట్లాడుతూ,ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం అందరూ కలిసి ముందడుగు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మలేరియా ఇంఛార్జి నోడల్‌ ఆఫీసర్‌ పి ఎన్‌ వి ఎస్‌ ప్రసాద్‌, పి హెచ్‌ ఎన్‌ ఎం రత్న సఖి, హెల్త్‌ విజిటర్‌ సిహెచ్‌ రవణ, ప్రేమ్‌ కుమార్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ వై.అనుష పాల్గొన్నారు.