Jul 01,2023 22:11

ఫొటో : మాట్లాడుతున్న ఎపిఎం సుధాకర్‌రావు

ఆహార ఉత్పత్తులపై అవగాహన
ప్రజాశక్తి-సీతారామపురం : మండలంలోని సంఘమిత్ర కార్యాలయంలో పొదుపు సభ్యులకు ఆదాయాభివృద్ధి కార్యక్రమాల కోసం ఆహార ఉత్పత్తులకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉమెన్‌ లెడ్‌ ఎంటర్ప్రైజెస్‌, క్రెడిట్‌ క్యాంప్‌కు సభ్యులందరూ హాజరయ్యారని, ఆహార ఉత్పత్తులకు సంబంధించి టిఫిన్‌ సెంటర్లు, ప్రొవిజన్‌ స్టోర్‌, మసాలా, కారంపొడి, బేకరీ ఐటమ్‌ సంబంధించి నిజమైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. యాక్టివిటీ కరెక్ట్‌గా ఉంటే ఇన్‌ఫెక్షన్‌ చేసి రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో ఎపిఎం సుధాకర్‌ రావు మాట్లాడుతూ ప్రతి వీవోలో నలుగురు సభ్యుల బ్యాంక్‌ ఆధార్‌ కార్డులు ఇచ్చి సివిల్‌ వెరిఫికేషన్‌ చేయించాలని వారి స్థోమతను బట్టి ఉమెన్‌ ఎంటర్ప్రైజెస్‌ యూనిట్లు మంజూరు చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ వెలుగు ఎపిఎం బి డబ్ల్యు సుధాకర్‌ రావు, కెనరా బ్యాంకు మేనేజర్‌ సందీప్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సుబ్రమణ్యం, సిసిలు బాల గురవయ్య, చెన్నకేశవులు, మరియమ్మ, ఎఫ్‌పిఒ సిసి తిరుపాలు, అకౌంటెంట్‌, సంఘమిత్ర ఆఫీస్‌ బేరార్స్‌, లబ్ధిదారులు పాల్గొన్నారు.