రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ సిహెచ్.విజరు ప్రతాప్ రెడ్డి పర్యటన
ప్రజాశక్తి - పెదపాడు
ఆహార పంపిణీలో ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ సిహెచ్.విజరుప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలో విజరు ప్రతాప్ రెడ్డి, కమిషన్ సభ్యులు కిరణ్‌తో కలిసి పలు పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని, శానిటేషన్ పరిస్థితులను, భోజనం వండే పరిస్థితులను, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, కోడిగుడ్లను అన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేశారు. అప్పనవీడ, కలపర్రు, వట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల ఆరోగ్య రీత్యా, చక్కటి మెనూ ద్వారా సిఎం జగన్ ప్రవేశపెట్టిన జగనన్న గోరుముద్దపై అధికారులు, ప్రధానోపా ధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అందరికీ రుచికరమైన ఆహారాన్ని అందించాలన్నారు. తద్వారా అనారోగ్య కారణాలు ఎదుర్కోవచ్చని, పౌష్టి కాహారం అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యరీత్యా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారని, ప్రభుత్వం సరఫరా చేసే బియ్యంలో ఫోర్ట్ పైడ్ రైస్ కలపడం వల్ల విద్యార్థుల్లో ఐరన్, బి విటమిన్ లోపాలను అధిగమిం చొచ్చన్నారు. తద్వారా మంచి ఆరోగ్యం పెంపొందిం చుకోవడం ద్వారా చదువుపై పూర్తి సమయాన్ని వెచ్చించవచ్చని తెలిపారు. వారు సందర్శించిన ఐదు పాఠశాలలు మధ్యాహ్న భోజనంపై పూర్తిస్థాయి సంతృప్తిని వ్యక్తం చేస్తూ, కలపర్రు పాఠశాలలో నూరు శాతం విద్యార్థులు భోజనం తినడం వల్ల రూ.పది వేలు విలువైన గిఫ్టును పాఠశాలకు పంపిస్తానని చెప్పారు. అనంతరం ఆ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు శ్రీకిరణ్, ఏలూరు ఉప విద్యాశాఖధికారి కె.లావణ్య, ప్రధానోపాధ్యాయులు రంగా ప్రసాద్, సురేష్, ఆదిలక్ష్మి రాజేశ్వరరావు, సావిత్రి, రవికాంత్, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజు, ఐసిడిఎస్ పీడీ పద్మావతి, సిడిపిఒ రాజశేఖర్, ఎంఇఒ నరసింహమూర్తి పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైరన్
ఏలూరు అర్బన్ : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు రోజులు పర్యటనలో భాగంగా సోమ వారం ఏలూరు చేరుకున్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ సిహెచ్.విజరు ప్రతాప్ రెడ్డి స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సం దర్భంగా జిల్లాలో తన పర్యటన వివరాలను ప్రతా ప్‌రెడ్డి వివరించారు. జిల్లాకు వచ్చే మార్గ మధ్యలో పలు విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశామ న్నారు. సోమవారం ఏలూరు జిల్లాలో పర్య టించి మం గళవారం, బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్య టించనున్నట్లు ఆయన తెలిపారు. సంద ర్శన అనం తరం ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం మూ డు గంట లకు ఏలూరులో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షా స మావేశం నిర్వహిస్తామని తెలిపారు. కమిషన్ సభ్యులు కిరణ్, డిఎస్‌ఒ ఆర్‌ఎస్‌ఎ స్‌ఎస్.రాజు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె.మంజుభార్గవి ఉన్నారు.










