ప్రజాశక్తి-అద్దంకి: ఆహార నియమాలు పాటిస్తూ ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరిగా చేస్తూ ఉంటే రోగాల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుందని ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందం తెలిపింది. మంగళవారం మండల పరిధిలోని కుంకుపాడు గ్రామ పరిధిలోని కళ్లం స్పిన్నింగ్లో ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మోకాళ్ల శాస్త్ర చికిత్స నిపుణుడు చావల ప్రకాష్ హాజరయ్యారు. వైద్యులు గోనుగుంట్ల శ్రీనివాస్, కొప్పుల జ్యోత్స్న ఈ శిబిరంలో దాదాపు 200 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళ్ళం ఇండిస్టీస్ రెసిడెన్షియల్ డైరెక్టర్ ఏ శివారెడ్డి సహాయ సహకారాలు అందించారు. ఉపాస్ సూపర్ స్పెషాలిటీ మార్కెటింగ్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










