ఆహార నాణ్యతలో రాజీపడొద్దు
- ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ విజరుప్రతాప్ రెడ్డి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : అంగన్‌వాడీ, రేషన్ డీలర్లు, సంక్షేమ హాస్టల్లో సిబ్బంది బాధ్యతగా పనిచేసి, ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్థులకు అందించే పౌష్టికాహారం అందించడంలో రాజీ పడొద్దని రాష్ట్ర ఫుడ్ కమిషన్ విజరుప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో నియోజకవర్గంలోని తహశీల్దార్లు, అంగన్‌వాడీ సిబ్బంది, ఎంఇఒలు, రేషన్ డీలర్లు, పౌరసరఫరాల శాఖ సిబ్బందితో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమైక్యంగా 2017లో ఫుడ్ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. ఐదుగురు ఐఎఎస్ అధికారుల ఈ కమిటీ ఫుడ్ కమిషన్ అధికారులను నియమించిం దని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సద్విని యోగం అయ్యేలా ఆయా హాస్టళ్లల్లో, అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహకులు చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. రేషన్ పాయింట్ నుంచి డీలర్లకు కొంతమేర తక్కువ తూకంతో సరుకులు సరఫరా అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పట్టుబడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి గురుకుల పాఠశాలలో ఎఎస్‌డబ్ల్యూఒలు వార్డెన్లు తరచూ పరిశీలించాలన్నారు. ప్రస్తుతం హాస్టళ్లకు అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే ఫోర్ట్‌ఫైడ్ బియ్యం ఎంతో నాణ్యతతో కూడినవని, ప్రభుత్వా లు రూ.60 చొప్పున కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నారని తెలిపారు. సరుకులు కాలపరిమితి దాటిన వాటిని చిన్నారులకు విద్యార్థు లకు వడ్డించ రాదని తెలిపారు. కార్యక్రమంలో ఫుడ్ కమిషన్ సురేష్, అంగన్‌వాడీల జిల్లా పిడి హేనాసుజనా, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, తహశీల్దార్ లక్ష్మీ నరసింహ, ఎంఇఒ నజీర్ బాషా, సిడిపిఒ జైనకుమారి, ఎఎస్‌డబ్ల్యూఒ శ్రీదేవి, హాస్టల్ వార్డెన్లు, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.










