ఆహా క్యాంటీన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు
* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం : డ్వాక్రా మహిళల ఆధ్వర్యాన నిర్వహించే ఆహా క్యాంటీన్‌లో రూ.40కే భోజనాన్ని విక్రయిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల రోడ్డులో ఆహా క్యాంటీన్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్యాంటీన్‌లో అన్నం, కూర, సాంబారు, పెరుగు కలిపి రూ.40కే అందిస్తున్నట్లు చెప్పారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ కిరణ్ కుమార్, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.










