Feb 16,2023 16:32

ప్రజాశక్తి-పాకాల : మండలంలోని కే వడ్డేపల్లి పంచాయతీ అచ్చమ్మ అగ్రహారం పాఠశాలను NCERT, SCERT బృందం సభ్యులు గురువారం ఉదయం  సందర్శించారు. పాఠశాలలో గల మౌళిక సదుపాయాలు, విద్యార్థి కేంద్రీకృత విద్య, మధ్యాహ్న భోజనం,పాఠశాల మరుగుదొడ్లు, జగనన్న గోరుముద్ద, అమ్మవడి వంటి అనేక కార్యక్రమాల మీద ఆరా తీయడం జరిగింది. SCERT అసిస్టెంట్ డైరెక్టర్ మృదుల భరద్వాజ్ గారు పాఠశాల  సందర్శన పట్ల తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.NCERT మెంటార్ టీచర్ దివ్య సింగ్ మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమం పాఠశాలలో రూపురేఖలు మార్చిందని, పాఠశాల చాలా అందంగా ఉందని, పాఠశాలలో అమలయ్యే అనేక కార్యక్రమాలు చాలా బాగున్నాయని అన్నారు.మరో మెంటార్ పంకజ్ ఉత్రేజా గారు మాట్లాడుతూ తాము ఇక్కడ పరిశీలించిన అన్ని విషయాలు NCERT లో చర్చించి  ఢిల్లీలో తమ పాఠశాలల్లో కూడా ఇదేవిధంగా అమలు జరిగేలా చూస్తామని అన్నారు. మండల విద్యాశాఖ  అధికారి బాబ్జి దగ్గరుండి సందర్శన బృందానికి పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు సదుపాయాల గురించి కూలంకషంగా  వివరించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష CMO సురేష్, ఢిల్లీ టీం అనురాధ, భావన, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జార్జ్ , ఉపాధ్యాయ బృందం, CRP జ్యోతి పాల్గొన్నారు.