Jul 27,2023 22:48

ప్రజాశక్తి-కాకినాడ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9 విజయవాడలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని పలు కార్మిక సంఘాల నాయకులు పిలుపు ఇచ్చారు. స్థానిక టీచర్స్‌ హోమ్‌లో సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, టిఎన్‌టియుసి నాయకులు రాజారావు, ఐఎన్‌టియుసి జిల్లా ఉపాధ్యక్షుడు కష్ణార్జున, ఐఎఫ్‌టియు నాయకులు మూర్తి అధ్యక్షతన జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.వెంకటేశ్వరరావు, టిఎన్టియుసి జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబు, ఎఐటియుసి రాష్ట్ర కన్వీనర్‌ గొడుగు సత్యనారాయణ, ఐఎన్టీయూసీ ఏపీ అండ్‌ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తాళ్లూరి రాజు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై పన్నుల భారాలు మోపుతూ, కార్మికులను బానిసలుగా మార్చేందుకు 29 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్లు తెచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, మధ్యాహ్న భోజన పథకం నేత నర్ల ఈశ్వరి, 108 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పెంకే రమణ, ఎఐబిఐ బ్యాంకు ఉద్యోగుల నాయకులు ఆదినారాయణ, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు దడాల పద్మ, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు అన్నవరం, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు, విఆర్‌ఎ సంఘం జిల్లా అధ్యక్షులు సురేష్‌ ఇజ్రాయిల్‌, మెడికల్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు రత్నరాజు, ఎపి ఎంఎస్‌ఆర్‌యు జిల్లా అధ్యక్షులు స్వామి, ఎపి బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ నేత రొంగల ఈశ్వరరావు, ఎఐటియుసి నాయకులు నరసరాజు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నేత బొబ్బిలి శ్రీనివాసరావు, మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కెవి.రామయ్య, ఎఐటియుసి నేత పప్పు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.