ప్రజాశక్తి-తిరువూరు
ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏ జెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో తిరువూరు తహశీల్దార్ కార్యా లయం ముందు సోమవారం ఏజెంట్లు, పలువురు బాధితులు ధర్నా చేసి తహ శీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల ముందు అగ్రిగోల్డ్ బాధితుల కు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకొని న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా సిపిఎం నాయకులు బి.వెంకటేశ్వరరావు, ఎం. ప్రభాకరరావు, సాంబారు వెం కటేశ్వర్లు, జెట్టి శ్రీనివాసరావు, కె.వెంక టరత్నం, సిపిఐ నాయకులు కె.సుంద రరావు, సి.హెచ్.వెంకటేశ్వరరావు, న సింహాద్రి వనమా లి, ఎస్.కె శుభాని, అశోక్, అసోసియే షన్ నాయకులు దేవిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కాంతారావు, జి.వీరభద్రరావు, తదితరులు పాల్గొ న్నారు.










