తాడేపల్లి రూరల్: అమరావతి ఆహార ఉత్పత్తులకు, వ్యవసాయ వ్యాపార రంగానికి కేంద్ర బిందువుగా ఉందని నాలెడ్జ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ డైరెక్టర్ అమిత్ జోషి అన్నారు. శుక్రవారం ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లి శ్రీ పార్చూన్ గ్రాండ్ లో జరిగిన 'కాన్ క్లేవ్' కార్యక్రమం జరిగింది. ఆహార ఉత్ప త్తులు, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార యజమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారత ప్రభుత్వ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మద్దతుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎపి ఛాంబర్స్, కెఎల్ డీమ్డ్ యూని వర్శిటీలు సహకారం అందించాయి. ఎపి చాంబర్స్ అధ్యక్షులు పి.భాస్కరరావు, కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ ప్రో చాన్సలర్ డాక్టర్ కె.ఎస్.జగన్నాథరావు, కెఎల్ ఫుడ్ టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ కె.శ్రీనివాసులు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రసంగించారు. భాస్కరరావు మాట్లాడుతూ న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నవంబర్ 3,5 తేదీలలో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా-2023 ప్రమోషన్ గురించి వివరించారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల పరిశ్రమల అధినేతలు రానున్నట్లు చెప్పారు. శ్రీనివాసులు మాట్లా డుతూ అగ్రిబిజినెస్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ప్రభుత్వ ప్రధాన రంగాలని, రానున్న కాలంలో ఆహార ఉత్పత్తుల పరిశ్రమలకు ఎక్కువ గిరాకీ పెరగనున్నట్లు తెలిపారు. యువత ఆ దిశగా ఆలోచించనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆహార ఉత్పత్తుల పరిశ్రమల వలన స్థానిక ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను యువత తమకు తాముగా సృష్టించుకోవడంతో పాటు పలువురికి ఉపాధి కల్పించిన వారవుతారని అన్నారు. నాబార్డ్ ప్రాజెక్ట్ లీడ్ కె. సుభాష్ కిరణ్ మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రిబిజినెస్ లు అనే రెండు రంగాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక విధానాలు, పథకాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను అందించ నున్నట్లు చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రిబిజినెస్ యూనిట్ల అభివృద్ధికి పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్ అనేది ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన ప్రాంతం అమరావతి అని అన్నారు. నాబార్డు డిజిఎం. ఎమ్మెస్ ఆర్.సి మూర్తి మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత పరిశ్రమ వృద్ధి, ఉపాధి కల్పనకు గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎపిఇడిఎ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ పెద్ద స్వామి, కొబ్బరి అభివృద్ధి బోర్డు డిప్యూటీ డైరెక్టర్ కుమారవేల్ సుబ్రమణియన్, రైతులు పాల్గొన్నారు.










