అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లతో రైతులకు ప్రయోజనం
ప్రజాశక్తి - కోవెలకుంట్ల
రైతుల పక్షపాతిగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం నాడు వైయస్సార్ రైతు దినోత్సవం సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్సార్ అగ్రిటెక్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్ర బోతుల పాపి రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రిటెక్ ల్యాబ్ వల్ల భూసార పరీక్షలు, విత్తనాలు ఎరువులు పురుగుల మందుల నాణ్యతను ఇక్కడ పరిశీలించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కర్రా గిరిజా రెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బివి నాగార్జున రెడ్డి, మండల ఉపాధ్యక్షురాలు షాజహాన్, కోయిలకుంట్ల పట్టణ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మెట్ల సరళ ఉపసర్పంచ్ జి సి ఆర్ సూర్యనారాయణ రెడ్డి, కోయిలకుంట్ల మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ భీమిరెడ్డి నాగ ప్రతాపరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కోయిలకుంట్ల మండల గ్రామ సచివాలయ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, పోచ వెంకటరామిరెడ్డి, మండల సర్పంచులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
పాణ్యం : మండల కేంద్రములో అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ను, నియోజకవర్గ స్థాయి పశు వ్యాధి నిర్ధారణ కేంద్రంను ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గాన్ని జిల్లా స్థాయిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ పల్లవి, ఎం పి పి హుస్సేన్ బీ,మండల అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
నందికొట్కూరు : అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లతో రైతులకు ప్రయోజనం అని మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అన్నారు. శనివారం నందికొట్కూరు పట్టణంలో డాక్టర్ వైయస్‌ఆర్ రైతు దినోత్సవం పురస్కరించుకొని డా.వైయస్‌ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ మురళీకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు నకిలీ విత్తనాలతో మోసపోకుండా వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర రైతు విభాగం చైర్మన్ వంగల సిద్ధారెడ్డి, అగ్రికల్చర్ ఏడి వర ప్రసాద్, ఎఈ విజయ శేఖర్, ఎమ్మార్వో రాజశేఖర్ బాబు, కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ గఫార్, కౌన్సిలర్ లు హామీద్ మియ్య, అబ్దుల్ రవూఫ్, మనపాడు అశోక్, లాలు ప్రసాద్, ఉపేంద్ర రెడ్డి, బొల్లెద్దుల రామక్రిష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి, జె.సి.యస్ మండల ఇంచార్జ్ ఓంకార్ రెడ్డి, వైస్ ఎంపీపీ పబ్బతి రవి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, వైసిపి నాయకులు శాలి భాష, కురువ శ్రీను, సులోచనమ్మ, వ్యవసాయ శాఖ అధికారులు తదీతరులు పాల్గొన్నారు.










