Apr 14,2023 23:24

ప్రజాశక్తి - ఏలూరు
                 ఈ నెల 14వ తేదీ నుంచి 20 వరకు అగ్పిమాసర వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ డి.మాల్యాద్రి తెలిపారు. శుక్రవారం ఆయన అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అసిస్టెంట్‌ జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ రామకృష్ణ, లీడింగ్‌ ఫైర్‌మెన్‌ రవి కుమార్‌, ఏలూరు స్మార్ట్‌ సిటీ లయన్స్‌ క్లబ్‌ కార్యదర్శి మారగాని శ్రీనివాసరావు, లయన్స్‌ 316 -జి జిల్లా రీడింగ్‌ ఏక్షన్‌ పోగ్రామ్స్‌ ఛైర్మెన్‌ కృష్ణారావు, రెడ్‌ క్రాస్‌ తరపున వైద్య విద్యార్థినులు పాల్గొన్నారు. తొలుత అమరవీరుల స్థూపం వద్ద సిబ్బంది, కుటుంబ సభ్యుల సమక్షంలో నివాళి అర్పించారు. అనంతరం మాల్యాద్రి మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
     భీమడోలు :భీమడోలు అగ్నిమాపక కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను గుర్తించి జిల్లా స్థాయిలో కేంద్రానికి పలు అదనపు సౌకర్యాలను కల్పించటం అభినందనీయమని భీమడోలు మానస ఇంగ్లీష్‌ మీడియం ఉన్నత పాఠశాల కరస్పాండెంట్‌ వై.రవీంద్రకుమార్‌ అన్నారు. భీమడోలు కేంద్రంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కొనసాగే అగ్నిమాపక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ మౌలిక సదుపాయాలు అభివృద్ధికి అగ్ని భద్రతపై నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భీమడోలు అగ్నిమాపక కేంద్ర అధికారి జి.నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఇతరులతో కలిసి చేపట్టారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని అమరులైన అమరవీరులకు నివాళులర్పించారు. అగ్నిమాపక కేంద్ర అధికారి జి.నాగరాజు మాట్లాడుతూ గతేడాది తమ శాఖ ద్వారా స్థానికంగా చేపట్టిన అగ్నిమాపక వారోత్సవాల అవగాహన కార్యక్రవ ూలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో భీమడోలు అగ్నిమాపక కేంద్ర అధికారి నాగబాబు పాల్గొన్నారు.