ప్రజాశక్తి - ఏలూరు
ప్రకృతి విపత్తుల సమయంలో మెరుగైన సేవలందించేందుకు రూ.12 లక్షలు విలువైన రెండు రెస్క్యూ బోట్లు, ఒక ఒబిఎంను జిల్లా అగ్నిమాపక సేవల శాఖకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అందజేశారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడ అమరావతి బోటింగ్ క్లబ్ నుంచి రప్పించిన రెండు రెస్క్యూ బోట్లను, ఒక ఒబిఎంను జిల్లా అగ్నిమాపక అధికారి డి.మాల్యాద్రికి కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక అధికారి డి.మాల్యాద్రి మాట్లాడుతూ విపత్తుల సమయంలో మెరుగైన సేవలందించేందుకు రెస్క్యూ బోట్లు అందించిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఎటువంటి విపత్తులు జరిగినా ప్రజలు తక్షణమే స్పందించి హెల్ప్ లైన్ నెంబర్ 101కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి వి.రామకృష్ణ, లీడింగ్ ఫైర్‌మెన్ రవికుమార్, డ్రైవర్ ఆపరేటర్లు ఎం.రామకృష్ణంరాజు, కె.రఘువర్మ, ఫైర్‌మెన్లు పి.ప్రశాంత్, జి.ఏసుబాబు, ఎంఎం.సత్యనారాయణ, ఎంఎస్‌వి.ప్రసాద్, డి.శ్రీనివాస్, ఎస్‌కె.అబ్దుల్ జబ్బార్ పాల్గొన్నారు.










