Feb 08,2021 13:54

ఏండ్ల తరబడి రైతు మద్దతు
ధర లేదని పోరు జరుగుతోంది
కనీస ధర కోసం
రైతు కాలు కదిపితే
లాఠీతో సమాధానమిచ్చిన రాజ్యమా
రైతే దేశానికి వెన్నెముకన్న నినాదమేమాయె
పండించే రైతుకు లేని హక్కు
పంట కొనేవాడికేలా
ధర నిర్ణయించే అధికారం

మద్దతు ధర లేదని
యుద్ధం జరుగుతోంది
రుణ సాయం లేదని
రణం జరుగుతోంది
తూటాలు పేలిన
లాఠీలు విరిగినా
అన్నదాతల ఆవేదన
ఎగిసి పోరాటమై సాగుతోంది

రండి...! కదలిరండి...!!
వ్యవసాయం చేసే రైతుకి
సాయం చేద్దాం
రైతు గోస
రాజ్యానికి వినిపిద్దాం

పండించే రైతు లేకపోతే
ధాన్యం ఎగుమతి
చేసుకునే స్థాయి నుండి
దిగుమతి చేసుకునే స్థాయికి
దిగజారి పోతామని
గళమెత్తి గర్జిద్దాం
రేపటి ఆకలి ఆర్తనాదాలను
ఆపలేమని కనువిప్పు చేద్దాం

పంట తక్కువై కల్తీ ఎక్కువైతె
ప్రజల ఆరోగ్యం, దేశ భవిష్యత్తు
దెబ్బతింటుందని బోధించి సాధిద్దాం
మరోసారి..! మరలబడ్డా
పోరాటాన్ని తిరగబెడదాం !!

నాగరాజు సాలం
9493745453