
ప్రజాశక్తి -కోటవురట్ల:అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారి అప్పలస్వామి సూచించారు. సోమవారం ఆయన మండలంలో పాములవాక గ్రామంలో అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కల్పించారు. ప్రమాదాల నివారణపై తీసుకోవలసిన చర్యలను మాక్ డ్రిల్‌తో ప్రదర్శించారు.రాత్రి సమయంలో ఎల్పీజీ గ్యాస్ రెగ్యులేటర్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలని సూచించారు, ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సాయికుమార్, సిబ్బంది అప్పారావు తారకేశ్వరరావు, రమేష్ బాబు, వాసు పాల్గొన్నారు.
యస్.రాయవరం:మండల కేంద్రంలోని వినరు ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఫైర్ స్టేషన్ ఆఫీసర్ డి రాంబాబు అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. స్కూల్ కారస్పాండెట్ బత్తుల వాసు పాల్గొన్నారు.