ప్రజాశక్తి - కాకినాడరూరల్
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అగిప్రమామక అధికారి వీరభదద్రరావు అన్నారు. సర్పవరం జంక్షన్ లో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు జరిగింది. సంస్థ భద్రత అధికారి ఎం వి ఆర్ మోహన్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి 27 వరకు తమ సంస్థ తరఫున అగ్ని ప్రమాదాల నివారణపై కాకినాడ పరిసర ప్రాంతాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. అగ్నిమాపక అధికారి ఎన్. వీరభద్రరావు వంట గ్యాస్ ప్రమాదాలు, విద్యుత్ ప్రమా దాలపై అవగాహన కల్పించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. అనంతరం ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. పి. పార్థసారథి, అడబాల సత్య నారా యణ, వాకర్స్ జిల్లా కోఆర్డినేటర్ అడబాల రత్న ప్రసాద్, డాక్టర్ కే వెంకటరమణ, డాక్టర్ కుమార్ యాదవ్, ఎస్. శ్రీ నగేష్, రవిశంకర్ పట్నాయక్, రేలంగి బాపిరాజు, రాఘవరావు పాల్గొన్నారు.










