Nov 15,2022 23:54

బాధిత కుటుంబానికి నిత్యావసరాలు అందజేస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి కిరణ్‌ తదితరులు

ప్రజాశక్తి- చింతూరు
మండలంలోని పేగా పంచాయతీ పరిధి నారకొండ గ్రామంలో సోడే ఎర్రయ్య ఇల్లు అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైన సర్వం కోల్పోవడంతో ఆయన కుటుంబాన్ని సిపిఎం నాయకులు మంగళవారం పరామర్శించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి.కిరణ్‌, మండల నాయకులు బాధితునితో మాట్లాడి అగ్ని ప్రమాద నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం, రెండు దుప్పట్లు, తువ్వాల, లుంగీ, వంట పాత్రలు, భోజనం ప్లేట్లు, గ్లాసులు, సోలార్‌ లాంతరు, ఇతర సామాగ్రి అందించారు. అనంతరం కిరణ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఎర్రయ్య కుటుంబానికి తక్షణ ఆర్థికసాయం అందించాలని ఆదుకోవాలని కోరారు. అగ్ని ప్రమాదంలో ఎర్రయ్య కుటుంబం ఆధార్‌ కార్డులు, రేషన్‌కార్డులు ఉపాధి హామీ జాబ్‌ కార్డు, బీరువాలో ఉన్న భూమిహక్కు పట్టాలు, బ్యాంకుపుస్తకాలు, బట్టలు, తిండి గింజలు సర్వం అగ్నికి ఆహుతయ్యాకని తెలిపారు. ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వాలని, కుటుంబం గడవడం కోసం మూడు నెలలకు సరిపడా నిత్యవసర వస్తువులు ఉచితంగా అందించాలని, తక్షణ సహాయం కింద రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దాతలు ముందుకొచ్చి సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సీసం సురేష్‌, నాయకులు కుంజా సీతారామయ్య, పల్లపు వెంకట్‌, ఎర్రంశెట్టి శ్రీనివాస్‌, మల్లం సుబ్బమ్మ, సవలం కన్నయ్య, కంగాల రంగయ్య, మడకం కన్నయ్య, కంగాల చంటి, పాల్గొన్నారు.