Feb 04,2023 17:39

ప్రజాశక్తి - భీమడోలు
              పొలసానిపల్లికి చెందిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు హామీ ఇచ్చారని సర్పంచి షేక్‌ రహీమా బేగం హసేన తెలిపారు. శుక్రవారం సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదంలో మద్దాల శ్రీమన్నారాయణకు చెందిన ఇల్లు దగ్ధమైంది. సదరు కుటుంబం వారు నిరాశ్రయులు కాగా రూ.రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో సర్పంచి షేక్‌ రహీమా బేగం హసేన దంపతులు శనివారం అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారిని ఆదుకుంటానని ఎంఎల్‌ఎ హామీ ఇచ్చారని తెలిపారు. తమ వంతు సహాయంగా బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం ఇతర వస్తువులు అందించారు. ఎంఎల్‌ఎ చొరవతో ప్రభుత్వ పరంగా వారికి మంజూరయ్యే సహాయాన్ని త్వరలోనే అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సర్పంచి దంపతులు గ్రామంలో జగనన్న- వాసన్న కాలనీలో గృహ నిర్మాణ సంస్థ సహకారంతో నిర్మాణాలు చేపట్టిన రెండు ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారి ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి ప్రముఖులు అంబటి నాగేంద్రప్రసాద్‌, చెరుకు మధు ,పంచాయతీ పాలకవర్గ సభ్యులు కోట శ్రీనివాసరావు విఆర్‌ఒ సింహాచలం, వాలంటీర్‌ హిమబిందు పాల్గొన్నారు.