బాధిత కుటుంబానికి సాయం చేస్తున్న నరసింగరావు
ప్రజాశక్తి -భీమునిపట్నం : జివిఎంసి నాలుగో వార్డు పరిధి చేపలుప్పాడ అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి వార్డు టిడిపి అధ్యక్షులు పాసి నరసింగరావు సోమవారం సాయం అందించారు. బాధితులు కారి అమ్మోరమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రూ.5 వేలు, బియ్యం బస్తా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కారి అప్పారావు, ఎంపిటిసి మాజీ సభ్యులు చీపుళ్ళ శ్రీనివాస్, తెలుగు యువత నియోజక వర్గ ఉపాధ్యక్షులు పాసి త్రినాధ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.










