ప్రజాశక్తి-పంగులూరు: కోటపాడు గ్రామంలోని దళిత కాలనీలో అగ్ని ప్రమాదం జరిగి ఇళ్లు కోల్పోయిన బాధితులను శనివారం వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, శాప్ నెట్ చైర్మన్ బాచిన కష్ణ చైతన్య పరామర్శించారు. లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల, గత సోమవారం కోటపాడు దళిత కాలనీలో నాలుగు ఇళ్లు, ఒక వరిగడ్డి వామి దగ్ధమైన విషయం పాఠకులకు తెలిసిందే. బాధితులకు శనివారం సాయంత్రం కృష్ణ చైతన్య కలిసి పరామర్శించి, అనంతరం ఆర్థిక సాయం అందించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటి సామగ్రిని కూడా కృష్ణ చైతన్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా, తాము అండగా ఉంటామని అన్నారు. ముఖ్యంగా పేదలకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అభివద్ధి కమిటీ అధ్యక్షులు రాయిని వెంకట సుబ్బారావు, వైసీపీ మండల కన్వీనర్ ఎర్రం శ్రీనివాస్‌రెడ్డి, బాపట్ల జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఎంసి మెంబర్, వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బీవీ కృష్ణారెడ్డి, అద్దంకి అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఎర్రమోతు రమేష్‌బాబు, కోటపాడు గ్రామ మాజీ సర్పంచ్ ఎర్రం గోపాల్‌రెడ్డి, అద్దంకి ఏఎంసీ మాజీ డైరెక్టర్ షేక్ సుభాని, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.










