Jun 22,2023 23:43

ఇళ్ల పట్టాలు అందిస్తున్న ఎమ్మెల్యే నంబూరు శంకరరావు దంపతులు

ప్రజాశక్తి - అచ్చంపేట : అచ్చంపేట మండలం పెదపాలెం అగ్నిప్రమాద బాధితులకు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వ్యక్తిగతంగా సాయం చేయడంతో పాటు ప్రభుత్వ సాయం కూడా గురువారం అందించారు. పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాధితులను మరింత సాయం అందేలా చూశారు. ప్రమాదంలో మరణించిన చిన్నారి పల్లవి కుటుంబసభ్యులను నంబూరు శంకర్రావు ఆయన భార్య వసంత కుమారి ఓదార్చారు. గతంలో వ్యక్తిగతంగా రూ.50 వేలు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే ఇప్పుడు గహనిర్మాణ శాఖ, రెవెన్యూ శాఖ సహకారంతో ఇంటి స్థలం పట్టా అందజేశారు. నిర్మాణం కోసం ప్రభుత్వ సాయం అందించేలా ఏర్పాట్లు చేశారు. రూ.లక్షతో బియ్యం, నిత్యావసరాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. స్నేహహస్తం సొసైటీ ద్వారా బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించేందుకు ముందుకు వచ్చింది. అదే సమయంలో స్నేహహస్తం సొసైటీ ఆధ్వర్యంలో బాధితులకు దుస్తులు, దుప్పట్లను, నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, వసంతకుమారి దంపతులు అందజేశారు.